జీవో 97ను తక్షణమే రద్దు చేయాలి

పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయొద్దు
టీఆర్పీ మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు బోనగిరి రాజేష్ డిమాండ్
పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.97ను తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు బోనగిరి రాజేష్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థుల విద్యా భవిష్యత్తు అంధకారంలో పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.పాలిటెక్నిక్ విద్యను యథావిధిగా ఎస్‌బీటెట్ పరిధిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.ఈసెట్ ప్రవేశాలు,ఉపకారవేతనాలు,రిజర్వేషన్లు,ఫీజు రీయింబర్స్‌మెంట్,డిప్లొమా గుర్తింపు,ఉద్యోగ అవకాశాలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు.విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా వివాదాస్పద జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని,అవసరమైతే ఇంటర్మీడియట్ బోర్డు తరహాలోనే పాలిటెక్నిక్ విద్యకు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసి దాని స్వతంత్రతను కాపాడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
