చిన్నారులకు అన్నదానం

సత్తుపల్లి/వేంసూరు,ఆగస్టు20(తెలుగు గళం) న్యూస్: నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో గల
రామన్నపాలెం గ్రామ సర్పంచ్ జంజునూరి కృష్ణకుమారి వరప్రసాద్ కుమార్తె జె. చస్మిత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రామన్నపాలెం ఎంపీయూపీఎస్తో పాటు పాతూరు పాఠశాల విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చిన్నారులతో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకుని వారికి భోజనం అందించారు.కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి, ఉపసర్పంచ్ పుచ్చకాయల శంకర్రెడ్డి, ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది పాల్గొన్నారు. చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు నింపేలా అన్నదానం నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. జె. చస్మితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
