


ఈ69 న్యూస్ హసన్పర్తి, ఏప్రిల్ 29
వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత బుధవారం హసన్పర్తి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లో పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నేర నియంత్రణకు మరింత పటిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు.తనిఖీ సందర్భంగా కేసు డైరీలు, జనరల్ డైరీ, రిజిస్టర్లు మరియు ఇతర రికార్డులను పరిశీలించి, వాటి నిర్వహణపై సిబ్బందికి తగిన మార్గదర్శకాలు ఇచ్చారు.స్టేషన్ పరిధిలోని గ్రామాలను తరచూ సందర్శిస్తూ ప్రజలకు పోలీసులు అందుబాటులో ఉండేలా చూడాలని పేర్కొన్నారు.ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకోవాలని, ముఖ్యంగా యువతలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆదేశించారు.ఈ తనిఖీలో సీఐ చేరాలు, ఎస్సైలు దేవేందర్, రవి, గోవర్ధన్ పాల్గొన్నారు.