పిఆర్ టియు మండల అధ్యక్షులుగా గీరెడ్డి ప్రమోద్ రెడ్డి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఘనపూర్ (స్ప్రే)లో నేడు జరిగిన పిఆర్ టియు టీఎస్ మండల శాఖ సర్వ సభ్య సమావేశంలో మండల అధ్యక్షలుగా మరోకసారి జెడ్పీహెచ్ఎస్ తాటికొండ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న గీరెడ్డి ప్రమోద్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా జనగామ జిల్లా పిఆర్ టియు టీఎస్ ప్రధాన కార్యదర్శి నూకలు ఎల్లారెడ్డి, ఎన్నికల పరిశీలకులుగా గిరెడ్డి సురేష్ కుమార్ మరియు గొట్టెముక్కుల శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు. 2026 – 2028 సంవత్సరాలకు గానూ ఎన్నుకున్న నూతన మండల కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శిగా వంగ రఘు గౌడ్, మండల బాధ్యులుగా మధుబాబు, విజేందర్, మంజుల, వెంకటయ్య స్వీకరించారు . ఈ కార్య క్రమంలో రాష్ట్ర బాధ్యులు కె. ప్రకాశం, పిట్టల వెంకటేశ్వర్లు, కె. ప్రవీణ్, భాస్కరరెడ్డి, వి.మురళి,పింగిలి వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.