పర్వతగిరి మండల ప్రజలకు కాంగ్రెస్ నేత సాయికృష్ణ పిలుపు
పర్వతగిరి మండల ప్రజలకు కాంగ్రెస్ నేత సాయికృష్ణ పిలుపు
తెలుగు గళం న్యూస్ పర్వతగిరి/ఏప్రిల్ 28
వరంగల్ జిల్లా:వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “స్వీయ గణన”ఆన్లైన్ నమోదు కార్యక్రమాన్ని పర్వతగిరి మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మండల కాంగ్రెస్ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ వంగ సాయికృష్ణ యాదవ్ పిలుపునిచ్చారు.ఏప్రిల్ 26వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు ప్రత్యేకంగా రూపొందించిన వెబ్ పోర్టల్ https://se.census.gov.in ద్వారా ప్రతి కుటుంబం తమ గృహ, కుటుంబ వివరాలను స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమం ప్రజలందరికీ చేరేలా మండల, గ్రామ స్థాయిలో విస్తృత అవగాహన కల్పించడం అవసరమని, ప్రతి కుటుంబం తప్పనిసరిగా ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు.“స్వీయ గణన ద్వారా కుటుంబాల వాస్తవ పరిస్థితులు, సభ్యుల వివరాలు, గృహ సమాచారం ప్రభుత్వానికి సమగ్రంగా అందుబాటులోకి వస్తాయి. భవిష్యత్ సంక్షేమ పథకాల అమలులో ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది”అని సాయికృష్ణ పేర్కొన్నారు.కావున పర్వతగిరి మండల ప్రజలందరూ ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా మే 10వ తేదీలోపు తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని, పొరుగువారికి, బంధుమిత్రులకు కూడా ఈ విషయంపై అవగాహన కల్పించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.