:కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
:కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి రేగొండ/కొత్తపల్లి గోరి
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు స్పష్టం చేశారు.మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉమ్మడి రేగొండ, కొత్తపల్లి గోరి మండల కేంద్రాల్లోని వడ్ల మక్కా కొనుగోలు కేంద్రాలను ఆయన అధికారికంగా ప్రారంభించారు.రేగొండ మండల కేంద్రంతో పాటు సుల్తాన్పూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం తూకంలో ఎలాంటి అవకతవకలు జరగకూడదని,ప్రతి బస్తా 40 కిలోల 650 గ్రాముల తూకం ఉండాలని అధికారులను ఆదేశించారు.ముఖ్యంగా కొన్నిచోట్ల ‘తరుగు’ లేదా ‘కట్టింగ్’ పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని, అలాంటి పనులకు పాల్పడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రైతులపై పైసా భారం పడకుండా, పూర్తి పారదర్శకతతో కొనుగోళ్లు సాగాలని సూచించారు.ధాన్యం సేకరణలో జాప్యం జరగకుండా సకాలంలో గొనె సంచులను అందుబాటులో ఉంచాలని, కల్లాల వద్ద ధాన్యం పేరుకుపోకుండా వెంటనే లారీలను ఏర్పాటు చేసి మిల్లులకు తరలించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.ప్రభుత్వం రైతు పక్షపాతి అని, కొనుగోలు ప్రక్రియలో దళారుల ప్రమేయం లేకుండా చూడాలని ఆయన కోరారు.రైతులు నాణ్యతా ప్రమాణాలను పాటించి,మద్దతు ధర పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణయ్య, రేగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏనుగు రవీందర్ రెడ్డి, రేగొండ సర్పంచ్ వానరాశి మౌనిక అంజి,మాజీ ఎంపీపీ పున్నం లక్ష్మీ రవి,సర్పంచులు వీరు నాయక్, రేపాక సర్పంచ్ తిరుపతి, ముఖ్య నాయకులు అట్టెం శంకర్, మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.వీరితో పాటు ఉమ్మడి మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు,వివిధ శాఖల అధికారులు, గ్రామ సర్పంచులు పెద్ద సంఖ్యలో రైతులు