ఈ69న్యూస్ జనగామ
జనగామ వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఉన్న ప్రధాన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ,తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ మరియు డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ ఆఫీసర్ (డిఎంఓ)నరేంద్ర కు వినతిపత్రం సమర్పించారు.వినతిలో పేర్కొన్న ముఖ్య డిమాండ్లు:
1.ఈ-నామ్లో బిడ్డింగ్‌లో పాల్గొనని ఆడ్తిదారులు, ఖరీదారుల లైసెన్సులను రద్దు చేయాలి.2.మార్కెట్ కమిటీ ద్వారా కాంటాలు ఇవ్వడం ద్వారా అవినీతిని అరికట్టి రైతులను రక్షించాలి.3.మార్కెట్ పరిధిలోని ట్రేడర్స్ వద్ద పెండింగ్‌లో ఉన్న మార్కెట్ సెస్ నిధులను వసూలు చేయాలి.4.రైతులు పండించిన అన్ని రకాల ఉత్పత్తులను ఇ-నామ్ ద్వారా కొనుగోలు చేసి లాభదాయక ధర కలిగే విధంగా చర్యలు తీసుకోవాలి.ఈ కార్యక్రమంలో జనగామ మాజీ శాసనసభ్యులు రాజిరెడ్డి,మార్కెట్ కమిటీ డైరెక్టర్ నామాల శ్రీను,తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందు నాయక్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు విజేందర్,రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రామావత్ మీట్యా నాయక్,మంగ బీరయ్య,మహిళా సంఘాల ఐకెపి ఇంఛార్జి అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.