9 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత9 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ8 May, 2026E69NEWS

9 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

9 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

మండల కేంద్రంలో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ (రేషన్) బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు,పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు.పోలీసులకు అందిన నమ్మదగిన సమాచారం మేరకు సివిల్ సప్లై ఇన్స్‌పెక్టర్ భాస్కర్ల రాజు, కొత్తపల్లిగోరి పోలీసులు కలిసి గ్రామంలోని చాపతి రమ (భర్త వీరన్న) అనే మహిళ ఇంట్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా దాచి ఉంచిన సుమారు 9 క్వింటాళ్ల రేషన్ బియ్యం బయటపడింది.ప్రభుత్వం పేదల కోసం పంపిణీ చేస్తున్న బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించిన సివిల్ సప్లై ఇన్స్‌పెక్టర్ భాస్కర్ల రాజు వెంటనే ఆ బియ్యాన్ని సీజ్ చేశారు.అనంతరం అక్రమ నిల్వలకు బాధ్యురాలైన సదరు మహిళపై ఫిర్యాదు చేయగా,కొత్తపల్లిగోరి ఎస్ఐ సాయి త్రిలోక్ నాథ్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ప్రభుత్వ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచినా లేదా అక్రమ రవాణాకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.ఈ దాడుల్లో సివిల్ సప్లై సిబ్బంది,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *