ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా బాలల రక్షణ
_ డ్రగ్స్ పై అవగాహన
తెలుగు గళం న్యూస్ నర్సంపేట ఏప్రిల్ // 29
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఐ సి డి స్ మెప్మా మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నర్సంపేట మున్సిపల్ పరిధిలోని మెప్మా కార్యాలయంలో
సి డి పి ఓ మధురిమ అధ్యక్షతన సైబర్ క్రైమ్,బాలల రక్షణ,యువతను మాదకద్రవ్యాల భారీ నుండి రక్షించేందుకు,యాంటీ డ్రగ్స్ నిర్మూలనకై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధునిక పరిజ్ఞానం కోసం వాడే సెల్ ఫోన్లు సైబర్ క్రైమ్ లకు దారితీస్తున్నాయని ప్రతి తల్లిదండ్రులు వీటిపై ఎప్పటికప్పుడు అవగాహనతో ఉండి అప్రమత్తంగా ఉండాలని,పిల్లల ప్రవర్తన పట్ల ఎలాంటి మార్పు కనిపించినా వెంటనే స్పందించి పిల్లలకి అవగాహన కల్పించాలని తెలిపారు.
షీ టీం,సైబర్ క్రైమ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి,కెరీర్ పై దృష్టి పెట్టాలని,మాదకద్రవ్యాలకు బానిసలైతే భవిష్యత్తు నాశనమవుతుందని తెలిపారు. గంజాయి లేదా డ్రగ్స్ విక్రయాలు,రవాణా గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
డ్రగ్స్ లేని సమాజాన్ని నిర్మించడం కేవలం ప్రభుత్వం లేదా పోలీసుల బాధ్యత మాత్రమే కాదని,ప్రతి పౌరుడు ఇందులో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కాటన్ భాస్కర్ ఆధునిక టెక్నాలజీలో మంచిని మాత్రమే స్వీకరించాలని..చెడు వ్యసనాల వైపు దారి మల్లొద్దని వేసవి సెలవులను విద్యార్థులు కంప్యూటర్ శిక్షణ కోసం మరియు శరీర దారుడ్యం కోసం వినియోగించుకోవాలని తెలిపారు.
ఈ సందర్భంగా సి ఐ ముష్కే శ్రీనివాస మాట్లాడుతూ
పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేస్తారని,వారి ప్రవర్తనలో కూడా మార్పులు వస్తాయని వాటిని తల్లిదండ్రులు గమనించాలని సూచించారు. డ్రగ్స్ కు అలవాటు అయ్యే ముందు సిగరెట్లకు అలవాటు పడతారని,సిగరెట్టు అలవాటు ఉంది అనగానే తల్లిదండ్రులు అప్రమత్తం కావాలని తెలిపారు. సైబర్ క్రైమ్ అనేది ఏ రూపంలో నుండి వస్తుందో తెలియదు కావున వాటిపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. సైబర్ క్రైమ్ వలన ఫోన్లలో డబ్బులు పోయినట్లయితే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930 నంబర్ కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
అంగన్వాడీ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి మాట్లాడుతూ
సైబర్ క్రైమ్,డ్రగ్స్,బాలల రక్షణ సంబంధించిన అవగాహన కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లే విధంగా మహిళా సంఘాలతో కలిసి అవగాహన ర్యాలీలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్సై గూడ అరుణ్ కుమార్, ఐ సి డి స్ సూపర్వైజర్ అరుణ,షీ టీం నాగభవ్య, డాక్టర్. శ్రావణ్ కౌన్సిలర్స్ రామోజు రోజా రాణి,పొన్నాల మనీషా,వేల్పుల శ్రీలత, ఐ సి డి స్ సూపర్వైజర్ అరుణ, అంగన్వాడి యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి,షీ టీం నుండి నాగభవ్య,మెప్మా సి అల్ ర్ పి సుమలత,కంప్యూటర్ ఆపరేటర్ సతీష్,అంగన్వాడి ప్రాజెక్టు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గొర్రె రాధ,బత్తిని శిరీష,,అంగన్వాడీ టీచర్స్,ఆశా కార్యకర్తలు,కిశోర బాలికలు పాల్గొన్నారు