ఈ69 న్యూస్ జనగామ జిల్లాఛత్తీస్ ఘడ్ లోని దంతే వాడ ఎన్కౌంటర్ లో అసువులు బాసిన దేవరుప్పుల మండలం,కడవెండి గ్రామానికి చెందిన మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ నాయకురాలు కామ్రేడ్ గుమ్మడవెల్లి రేణుక అలియాస్ మిడ్కో,అలియాస్ భాను,అలియాస్ దమయంతి,చైతే భౌతికకాయాన్ని దేవరుప్పుల పిఏసిఎస్ డైరెక్టర్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు.అంతే కాకుండా వారి భౌతిక దేహాన్ని బంధుమిత్రుల కమిటీ నాయకులు,విరసం నాయకులు,మాజీ మావోయిస్టు నేత గాద ఇన్నయ్య,పౌర హక్కుల,మానవ హక్కుల సంఘం నేతలు,గ్రామస్తులు సందర్శించి నివాళులర్పించారు.