వనమా ఇంటికి ఎలక్షన్ కోడ్ వర్తించదా..?వనమా ఇంటికి ఎలక్షన్ కోడ్ వర్తించదా..?
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ3 February, 2026E69NEWS

వనమా ఇంటికి ఎలక్షన్ కోడ్ వర్తించదా..?

వనమా ఇంటికి ఎలక్షన్ కోడ్ వర్తించదా..?
  • మాజీ మంత్రి పుట్టినరోజు ఫ్లెక్సీలపై అధికారుల మౌనం..?
  • కోడ్ వచ్చి వారం అవుతున్నా తొలగించలే..!
  • సామాన్యులకేనా చట్టం..!!పెద్దల వద్ద నిబంధనలు గాలికి ?
  • మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు నివాసం వద్ద ఉన్న భారీ ఫ్లెక్సీ రాజకీయ వర్గాల్లోనే కాకుండా ప్రజల్లోనూ తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఎన్నికల నిబంధనలు అందరికీ సమానమేనని చెప్పే అధికారులు, ఈ ఫ్లెక్సీల విషయంలో మాత్రం కళ్లకు గంతలు కట్టుకున్నారా..? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
  • వనమా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ ప్రధాన రహదారులపై స్పష్టంగా దర్శనమిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. చిన్న పోస్టర్ పెట్టిన వారిపై వెంటనే నోటీసులు జారీ చేసే యంత్రాంగం, ప్రభావవంతుల ఇళ్ల వద్ద మాత్రం మౌనదీక్ష పాటించడం ఎన్నికల కోడ్ అమలుపై తీవ్ర సందేహాలు రేకెత్తిస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో రాజకీయ ప్రాచారం, వ్యక్తి ఆరాధనకు పూర్తిస్థాయిలో నిషేధం ఉండాల్సి ఉండగా, ఈ విధమైన ఫ్లెక్సీలు బహిరంగంగా ఉండటం నిబంధనల ఉల్లంఘన కాదా..? అన్న ప్రశ్న ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. కోడ్ అనేది బలహీనులకు మాత్రమేనా..? బలవంతుల వద్ద అది సడలింపుగా మారుతుందా..? అన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది.
  • ఎన్నికల నైతికత, ప్రజాస్వామ్య విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారుతున్న ఈ తరుణంలో, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఫ్లెక్సీల తొలగింపు, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఎన్నికల కోడ్ అనేది కేవలం కాగితాలకే పరిమితమై, ప్రజల కళ్లలో ఒక ప్రహసనంగా మిగిలిపోతుందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అధికార యంత్రాంగం ఇప్పటికైనా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. కాగా దీనిపై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాతను వివరణ కోరగా, వెంటనే వాటిని తొలగిస్తామని తెలిపారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *