ఇల్లంద వ్యవసాయ మార్కెట్ వద్ద బీజేపీ ధర్నా–రైతు సమస్యలపై నేతల ఆగ్రహం

ఈ69న్యూస్ వరంగల్/వర్ధన్నపేట మే05
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని వ్యవసాయ మార్కెట్ వద్ద బీజేపీ నాయకులు నిర్వహించిన ధర్నా–రాస్తారోకో కార్యక్రమం ఉద్రిక్తంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు బస్వపురం లక్ష్మి నరసయ్య, వరంగల్ జిల్లా ఇంచార్జి కొండపల్లి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకటరమణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, రైతే దేశానికి వెన్నుముక అని పేర్కొంటూ రైతులు పండించిన ధాన్యం, మక్కజొన్నలను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తోందని ప్రశ్నించారు.కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వెంటనే సమస్యలను పరిష్కరించి, అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.రైతుల బాధలు తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందని, ఇది సిగ్గుచేటని బీజేపీ నేతలు మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మల్లాడి తిరుపతి రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జలగం రంజిత్, సిద్ధం నరేష్ పటేల్, నియోజకవర్గ కన్వీనర్ ముత్తిరెడ్డి కేశవరెడ్డి, జిల్లా కార్యదర్శి రాయపురం కుమారస్వామి, సర్పంచ్ రాయపురం రమ్య, మహిళా మోర్చా ఉపాధ్యక్షులు మంజుల రెడ్డి, ఖంభంపాటి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.