పారిశుద్ధ పనులు ప్రారంభించిన నల్లబెల్లి సర్పంచ్
వరంగల్ జిల్లా:వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ జక్కి అనిత శ్రీకాంత్ ఆధ్వర్యంలో పారిశుద్ధ పనులు ప్రారంభమయ్యాయి.వర్షాకాలం నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలవకుండా ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామంలోని ప్రధాన మురికి కాలువల శుభ్రత పనులను సర్పంచ్ శ్రీకారం చుట్టారు. గతంలో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంత గృహాలు నీట మునిగిన సంఘటనలు పునరావృతం కాకుండా ప్రధాన కాలువతో పాటు గ్రామంలోని వివిధ కాలువలను శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మేకల దేవేందర్,వార్డు మెంబర్లు గోలి సుధాకర్,మహమ్మద్ జమీలాభి, మాజీ ఉపసర్పంచ్ బిర్రు చంద్రయ్య, యువ నాయకుడు పొన్నం వేణు, గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.