తెలంగాణ రాష్ట్ర కుమ్మర్ల తొలి బోనాల జాతరకు విస్తృత ఏర్పాట్లుతెలంగాణ రాష్ట్ర కుమ్మర్ల తొలి బోనాల జాతరకు విస్తృత ఏర్పాట్లు
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ10 July, 2026E69NEWS

తెలంగాణ రాష్ట్ర కుమ్మర్ల తొలి బోనాల జాతరకు విస్తృత ఏర్పాట్లు

తెలంగాణ రాష్ట్ర కుమ్మర్ల తొలి బోనాల జాతరకు విస్తృత ఏర్పాట్లు

తెలంగాణ రాష్ట్ర కుమ్మర్ల తొలి బోనాల జాతరను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. జాతరను విజయవంతం చేయాలనే లక్ష్యంతో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులను కలిసి ఆహ్వాన పత్రాలు అందజేస్తున్నారు.
ఈ సందర్భంగా గురువారం రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ మల్‌రెడ్డి రామిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి జాతరకు ఆహ్వానించారు.
ఆహ్వాన కార్యక్రమంలో రాష్ట్ర కుమ్మర సంఘం ప్రధాన కార్యదర్శి మల్కాజ్గిరి దయానంద్, తొలి బోనాల జాతర కన్వీనర్ ఆడాల గణేష్‌తో పాటు ఎగిరి చెట్టు వీరయ్య, జిల్లెల్ల శంకరయ్య, శ్రీనివాస్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, కుమ్మరుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే తెలంగాణ రాష్ట్ర కుమ్మర్ల తొలి బోనాల జాతరను అందరి సహకారంతో విజయవంతం చేయాలని కోరారు. భక్తులు, కుమ్మరి సంఘ సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతర వైభవాన్ని మరింత గొప్పగా చాటిచెప్పాలని పిలుపునిచ్చారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *