తల్లిపాలే శిశువుకు శ్రీరామరక్ష
అవగాహన సదస్సులో సూపర్వైజర్ సరోజ,డిసిపిఒ కొమురయ్య ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా రేగొండ (3వ సెంటర్), పెద్దంపల్లి అంగన్వాడీ కేంద్రాలలో తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ సూపర్వైజర్ సరోజ,జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాజ కొమురయ్య ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.పుట్టిన గంటలోనే శిశువుకు తల్లిపాలు పట్టించాలని,మొదటి ఆరు నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి,సంపూర్ణ ఆరోగ్యం లభిస్తాయని సూపర్వైజర్ సరోజ తెలిపారు.తల్లిపాలు శిశువుల శారీరక,మానసిక ఎదుగుదలకు,తల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని డిసిపిఒ రాజ కొమురయ్య పేర్కొన్నారు.బాల్యవివాహాలు,బాలకార్మిక వ్యవస్థ,వేధింపులను అరికట్టేందుకు సమాజం అప్రమత్తంగా ఉండాలని,పిల్లలకు ఎలాంటి అత్యవసర పరిస్థితి వచ్చినా 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అవుట్‌రీచ్ వర్కర్ సోషల్ కుమార్,అంగన్వాడీ టీచర్లు బి.విమలాదేవి,పుష్పలత,ఆశా కార్యకర్తలు,గర్భిణులు,బాలింతలు పాల్గొన్నారు.