రేగొండలో ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి
రేగొండలో నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు,ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త,ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా రేగొండ మండల కేంద్రంలో గురువారం నివాళులర్పించారు.మండల కేంద్రంలోని ఇందిరా గాంధీ కూడలి వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు,రేగొండ మండల ఉద్యమకారుల ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అంజలి ఘటించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్,ఎన్ఎస్ఆర్ అధినేత నాయినేని సంపత్ రావు హాజరై మాట్లాడారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సార్ అందించిన సిద్ధాంత బలం,ఉద్యమానికి చూపిన దిశానిర్దేశం చిరస్మరణీయమని కొనియాడారు.ఆయన ఆలోచనలు,ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావడమే జయశంకర్ సార్కు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి రేగొండ మండల మాజీ ఎంపీపీ పున్నం లక్ష్మీ రవి,రేగొండ మండల ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు పత్తి బుచ్చిరెడ్డి,మాజీ ఎంపీటీసీలు పట్టెం శంకర్,మైస భిక్షపతి,ఐలి శ్రీధర్ గౌడ్,అలాగే నాయకులు పసుల అశోక్,గోగుల అశోక్ రెడ్డి,గండి అశోక్,లింగారెడ్డి,గండి తిరుపతి గౌడ్,చెట్ల రమేష్,కట్ల సంజీవరెడ్డి,వెల్దండి అశోక్,ఉద్యమకారులు పాల్గొన్నారు