పేద వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట
స్టేషన్ ఘనపూర్ మండలం నమిలిగొండ కస్తూరిభా గాంధీ పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన 2లక్షల 50వేలతో ఆర్.ఓ వాటర్ ప్లాంట్ మరియు లక్షా 50వేలతో హైమాస్ లైట్లను ప్రారంభించారు. అలాగే 40 లక్షలతో నిర్మిస్తున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాసేపు ఉపాధ్యాయునిగా మారి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. అనంతరం పాఠశాలకు నేను ఇచ్చిన హామీలను నెరవేర్చానని, ఉత్తమ ఫలితాలు సాధించి ఉపాధ్యాయులు, విద్యార్థులు మీ బాధ్యతలను నెరవేర్చాలని సూచించారు.అలాగే నమిలిగొండ గ్రామంలో 23లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణానికి మరియు కోటి రూపాయలతో నిర్మించనున్న కూడా రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు.అనంతరం స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో స్టేషన్ ఘనపూర్ మండలానికి సంబందించిన 38 మంది కళ్యాణ లక్ష్మి- షాదీ ముబారక్ లబ్ధిదారులకు 38లక్షల 04వేల 408రూపాయల విలువగల చెక్కులను పంపిణి చేశారు. తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్బంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలో ఉన్నప్పటికీ రైతు, మహిళా, పేద వర్గాల సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు కొంతమంది కళ్ళకు కనిపించడం లేదని అన్నారు. రాష్ట్రంలో 22వేల 500కోట్లతో 4లక్షల 50వేల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 13వేల 500కోట్లతో ఒక్కొక్కరికి 6కిలోల చొప్పున ఉచిత సన్న బియ్యం పంపిణి, గృహ అవసరాలకు 200యూనిట్ల ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డులు వంటి అనేక పథకాలు పేద వర్గాల ప్రజలకు ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ఈ ఆగస్టు 15 నుండి రాష్ట్రంలో కొత్త వితంతు పెన్షన్లు మంజూరు కాబోతున్నాయని వెల్లడించారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో 1500కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. ఒక్క నమిలిగొండ గ్రామంలోనే కోటి 50లక్షల సిసి రోడ్లు, గ్రామ పంచాయతీ భవనం, 30ఇందిరమ్మ ఇండ్లు, వివో భవనం, కమ్యూనిటీ హల్లు మంజూరు చేసుకున్నామని తెలిపారు. గత 15ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఎం పని చేశాడో ఇప్పుడు నేను ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తున్నానో ప్రజలు గమనించాలని కోరారు. రాబోయే రోజుల్లో నమిలిగొండ గ్రామాన్ని ప్రత్యేక దృష్టితో అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు తీవ్ర సాగు నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నిన్ననే రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో దేవాదుల రిజర్వాయర్ల ద్వారా ఆరుతడి పంటలకు సాగు నీరు అందించాలని కోరడం జరిగిందని మంత్రి గారు వెంటనే స్పందించి అధికారులకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఇప్పటికే ధర్మసాగర్ రిజర్వాయర్ ద్వారా సాగు నీరు విడుదల చేశామని, వారం రోజులలో ఘనపూర్, అశ్వరావుపల్లి, గండి రామారం రిజర్వాయర్ల ద్వారా కూడా సాగు నీరు విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, మున్సిపల్
వైస్ ఛైర్మన్ నీల రాజమ్మ,నమిలిగొండ సర్పంచ్ కోమల, బెలిదే వెంకన్న,రాజేష్ నాయక్, పురమాని రజాక్ యాదవ్, బూర్ల శంకర్, దేవస్థాన చైర్మన్ నర్సింహులు,కిషన్ రాజ్,గన్ను నర్సింహులు,
గట్టు రమేష్,శ్రీరాములు,పులి యాకయ్య, పోశాల కృష్ణ,సుదర్శన్,
హరిబాబు,ఎమ్మార్వో స్వప్న,ఎంపిడిఓ విజయశ్రీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు,గ్రామస్థులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.