
telugu galam news e69news local news daily news today news
ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జన్నారం గ్రామంలో అహ్మదియ్య ముస్లిం యువకుల ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్షా ప్యాడ్ లు పెన్నులు మొదలగునవి పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా ఇంఛార్జి ముహమ్మద్ అక్బర్,జిల్లా యూత్ అధ్యక్షుడు ముహమ్మద్ హుస్సేన్ మరియు మోల్వి బాబర్ అహ్మద్ లు మాట్లాడుతూ.. ఇస్లాం ధర్మం సేవాగుణమైనది మరియు శాంతి యుతమైనదని అన్నారు.నేడు అహ్మదియ్య జమాత్ ప్రపంచ వ్యాప్తంగా కుల మతాలకతీతంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని,సర్వ మత ఆచారాలను గౌరవిస్తుందని అదే విధంగా ప్రపంచ శాంతి సోదరభావం గురించి కృషి చేస్తుందని తెలిపారు.అదే విధంగా మన భారత రాజ్యాంగం ప్రకారం మన దేశంలో కుల మతాలకతీతంగా ప్రజలందరూ ప్రేమ ఆప్యాయతలతో ఐకమత్యంగా ఉండటం అనేది గర్హనీయమైనదని తెలిపారు.నేటి బాలలు రేపటి పౌరులు కావున మీరందరూ మంచిగా ఎదిగి దేశానికి ఉపయోగ పడేలా ఉండాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు,ఎంపీటీసీ శిరీష,సర్పంచ్ పద్మావతి ఉప సర్పంచ్ రామారావు,గ్రామ పెద్దలు,గ్రామ జమాత్ సదర్ నాసర్ సాహెబ్,కాసిం,హాసన్,సిద్దా,మైసూర్ సాబ్,మౌలాలి,పుల్లా సాబ్,అస్గర్ అలి,అబ్బసలి,దానిష్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.