
telugu galam news e69news local news daily news today news
మునగాల మండల కేంద్రంలో ఆదివారం ప్రభుత్వం సేకరించిన భూమిలో మరియు సర్వేనెంబర్ 491లో గల ప్రభుత్వ భూమిలో ఆదివారం ఈరోజు పేదలు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకున్నారు ఈ సందర్భంగా గుడిసె వాసు ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు మాట్లాడుతూ అసైన్మెంట్ చట్టం 77 ప్రకారం పేదవాడు ప్రభుత్వ భూములో గుడిసెలు వేసుకుంటే పట్టాకులు కల్పించాలని చట్టం చెబుతుందని వారు అన్నారు మునగాల మండల కేంద్రంలో ఏళ్ల తరబడి ఇల్లు లేక ఒక ఇంటిలో నాలుగు కుటుంబాలు సహజీవనం గడుపుతున్నారని వారన్నారు జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకొని ప్రభుత్వ భూమిలో పేదలకు ఇండ్లకు పట్టా హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ యొక్క భూ పోరాటంలో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు కావాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ యొక్క కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మేదరమట్ల వెంకటేశ్వరరావు జిల్లా రైతు సంఘం నాయకులు దేవర వెంకటరెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సోమపొంగు జానయ్య గడ్డం వెంకన్న కిన్నెర వెంకన్న లంజపల్లి చిన్న వెంకన్న సాల పిచ్చయ్య నెమ్మాది పవన్ డాకూరి వీరబాబు దర్శిని మైసమ్మ పుట్టేటి మంగమ్మ పొట్టేటి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు