
telugu galam news e69news local news daily news today news
సర్పంచుల పదవి కాలం ముగుస్తుండడం తో వారికి హార్ధిక శుభాకాంక్షలు తెలిపిన స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గళం న్యూస్ స్టేషన్ ఘనపూర్ స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని ఎం.పి.డి.వో కార్యాలయంలోని సర్వ సభ్య సమావేశం ఎం.పి.పి కందుల రేఖ గట్టయ్య అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమన్వయంతో అభివృద్ధి చేసుకోవాలి ప్రజా ప్రతినిధులు,అధికారులు సమన్వయంతో పని చేసి గ్రామాలను అభివృద్ధి చేయాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.విది నిర్వహణలో అధికారులు అంకిత భావంతో పనిచేయాలన్నారు.ఇక ముందు జరగబోయే సర్వసభ్య సమావేశానికి పూర్తి సమాచారం తో రావాలని అన్ని శాఖల అధికారులకు సూచించారు. స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి లో గర్భిణీలకు మెరుగైన వైద్యం అందించి ప్రసూతి సంఖ్యను పెంచాలన్నారు.అనంతరం పదవి ముగియనున్న సర్పంచులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు,ఎంపీటీసీలు,మండల కో ఆప్షన్ సభ్యులు ,ఎంపీడీఓ, స్థానిక ఎమ్మార్వో, మరియు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు