
telugu galam news e69news local news daily news today news
భద్రాచలం నియోజకవర్గస్థాయి బీఆర్ ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు భద్రాచలం ఎమ్మెల్యేను గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. బీ ఆర్ ఎస్ ప్రస్థానంలో పూల బాటలు ఉన్నాయి, ముల్ల బాటలు ఉన్నాయని, 2009 లో 10 స్థానాలు మాత్రమే గెలిచామని, అధైర్యపడి ఉంటే తెలంగాణ వచ్చేది కాదు అన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అయ్యేవాడు కాదు, ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదని అన్నారు. కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చిందని, రేవంత్ రెడ్డికి నేడు సీఎం పదవి వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం చేసి గెలుపు సాధించారని, అనేక అబద్ధాలు ప్రచారం చేశారని అన్నారు. గృహనిర్మాణ శాఖ ఉద్యోగులను నా కుటుంబ సభ్యులుగా చూస్తా ప్రగతి భవన్ లో బంగారు బాత్ రూములు, వంద రూములు ఉన్నాయని గతంలో ప్రచారం చేశారని, ఉన్నాయా అని ఉప ముఖ్య మంత్రిని అడిగితే సమాధానం చెప్పలేదని ఎద్దేవా చేశారు. అధానితో అలైబలై చేసుకున్నది రేవంత్ రెడ్డి కాదా, ఎవరు ఎవరితో చీకటి ఒప్పందం చేసుకున్నట్టు, ఎవరు ఎవరితో కుమ్మక్కు అయినట్టు ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీతో ఒప్పందం పెట్టుకున్నది మీరు కాదా అన్నారు. తాము బండి సంజయ్, ఈటెల రాజేందర్, రఘునందన్ రావులను ఓడించాం అని పేర్కొన్నారు. రాష్ట్రం అప్పు 3.87 లక్షల కోట్లు అయితే 7 లక్షల కోట్లు అని సీఎం ప్రచారం చేస్తున్నారని, రెండు నెలలు కాలేదు 14 వేల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే అని అన్నారు. మార్పు తెస్తా అని అభాగ్యులు, అన్నర్ధులు, పేదలకు నెలనెలా పింఛన్లు ఇవ్వలేని ప్రభుత్వం కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు. గెలిస్తే రూ. 4000 పింఛన్ అన్నారు కానీ పెరగలేదన్నారు. 6 లక్షల మంది ఆటో సోదరులను రోడ్డున పడేయడమే మార్పా అన్నారు. రైతు బంధు ఫిబ్రవరి దాకా పడక పోవడం మార్పా? అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ లోపు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హామీలు అమలు అయ్యేదాకా తమ పోరాటం ఆగదన్నారు. భద్రాచలం కరకట్ట కోసం 39 కోట్లు ఇచ్చామని, పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించాలని, మూడో సారి కూడా మహబూబాబాద్ ఎంపీ బీఆర్ ఎస్ అభ్యర్థి గెలవాలని కోరారు. గల్లీలో, ఢిల్లీలో ఎవరు అధికారంలో ఉన్నా తెలంగాణ కోసం పోరాటం చేసేది బీఆర్ ఎస్ ఎంపీలే అని అన్నారు. నాడు 7 మండలాలను ఆంధ్రాలో కలిపింది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే అని తెలిపారు.