రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ ఆర్మూర్ mro ఆఫీస్ డిప్యూటీ mro కు వినతి పత్రాన్ని సమర్పించారు అనంతరం రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జూన్ 19న 14 పంటలకు మద్దతు ధరలను పెంచుతూ ప్రభుత్వం ప్రకటించింది గత ఏడాది నిర్ణయించిన ధరలు పై ఐదు నుంచి ఏడు శాతం మాత్రమే పెంచారు వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు 20 నుంచి 22 శాతం పెరిగినవి ఖర్చులను తగ్గించి చూపి దానికి 50 శాతం కలిపి ధరలు ప్రకటించాలని ధరల నిర్ణయక కమిషన్ రికమండేషన్లు ప్రధాని నేతృత్వంలోని క్యాబినెట్ పరిగణలోకి తీసుకొని లేదు పక్కన ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, కేరళ, తరలహాలో రాష్ట్రంలో ధరలు నిర్ణయిక కమీషన్ సీఏ సీపీ వేసి రాష్ట్రంలో పండే అన్ని పంటలకు మద్దతు ధరలను నిర్ణయించి అమలు చేయాలని స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని సీ2+ 50 శాతం లపై రైతులకు మద్దతు ధర ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అందరికీ వాన కాలం పంట సంబంధించి యూరియా ఎరువులు అన్ని అందుబాటులో ఉంచాలని ముందస్తు ప్రణాళిక ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తోగటి భువనేశ్వర్, జిల్లా నాయకులు చల్ల గణేష్, గంగారం, నవీన్ భాయ్, జయ తదితరులు పాల్గొన్నారు