బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మంచాల ఎల్లయ్య
తెలుగు గళం జఫర్ఘడ్
ప్రజాకవి,స్వాతంత్ర సమరయోధుడు,పద్మ విభూషణ్ కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా స్టేషన్ ఘనపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మంచాల ఎల్లయ్య తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…తెలంగాణ అచ్చ తెలుగుదనానికి యాసకు సేవలు చేసి కలాన్ని అక్షర అణ్వస్త్రంగా వాడిన భాషాభిమాని కాళోజీ నారాయణరావు అని అభివర్ణించారు.కాళోజీ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకోవడం ఆనందదాయకమని,తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.నిరంతరం తెలంగాణ కోసం పరితపించిన కాళోజీ మానవీయ విలువలను చాటారని కొనియాడారు.మానవతే కేంద్రంగా కవిత్వాన్ని రాసి ప్రపంచవ్యాప్తం చేశారన్నారు.పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది అని మనిషి ధర్మాన్ని ఎలుగెత్తి చాటిన మానవతావాది అని జాతి ఉషస్సు,తెలంగాణ తేజస్సు,ప్రజా కవి,పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు యాదిలో చిరస్మరణీయంగా నిలిచిపోయాయన్నారు.కాళోజీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని వారి స్ఫూర్తిని కొనసాగించాలన్నారు.