
ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని శ్రీవాణి గురుకుల విద్యాలయంలో 1998-99 పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.ఉదయం నుంచి సాయంత్రం వరకు తాము పాటలు నేర్చుకున్న స్కూల్లో ఆనందంగా గడిపారు.మొదట్లో మండలంలో శ్రీవాణి గురుకులం పాఠశాల ఒకటే ఉండేదని ఆనాడు గురువులు చెప్పిన పాఠాలు మాకు ఇప్పటికీ గుర్తుకు వస్తున్నాయని పూర్వ విద్యార్థులు నెమరు వేసుకున్నారు.రానున్న రోజుల్లో ఇలాగే పూర్వ వి ద్యార్థుల సమ్మేళనం జరుపుకొని చదువుకున్న పాఠశాలకు నిరుపేద వి ద్యార్థులకు ఆర్థికసాయం అందించాలని భావిస్తున్నట్లు తెలిపారు.అనంతరం తమ భవిష్యత్తుకు బాటలు వేసిన గురువులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కందికొండ సంపత్ కుమార్,కుమారస్వామి,సాంబయ్య,,పూర్వ విద్యార్థులు జయశ్రీ గీతాంజలి సుకన్య శ్రీలత రజిత రాజిరెడ్డి సుధాకర్ రంజిత్ మహేష్ యుగంధర్ తిరుమల నవీన్ రాకేష్ విజయ్ సంతోష్ రాజు రాకేష్ శ్రీకాంత్ ప్రదీప్ సురేందర్ కిరణ్ నవీన్ కుమార్ రాజిరెడ్డి శ్రీకాంత్ ముఖేష్ మహేష్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.