
ఈ69న్యూస్ జఫర్ఘడ్
జనగామ జిల్లా జాఫర్‌గఢ్ మండలం కొనాయాచలం రెవెన్యూ గ్రామ రెవెన్యూ శివారులో 161సి/2 సర్వేనెంబర్లో 26 ఎకరాల 22గుంటల ప్రభుత్వ భూమిలో ప్రభుత్వం నేషనల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ ఏర్పాటు చేయడం శుభనందనీయమని భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మండల కార్యదర్శి జువారి.రమేష్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలని భూమి లేని నిరుపెదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని గుడిసెలు వేసి అనేక మార్లు ఆందోళనలు పోరాటలు చేసినా చరిత్ర సీపీఐదేనని ఆయన అన్నారు.అట్టి భూమిని ఆనాడు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వంలో అన్యాక్రాంతానికి గురైనా భూమిని వెలికితీసి ప్రభుత్వపరం చేసి బోర్డు పెట్టించి నేడు ప్రభుత్వం గుర్తించి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ ను ఏర్పాటు చేయడం దానికి 200 వందల కోట్లు కేటాయించడం హర్షణయం అని అన్నారు.వచ్చే విద్యా సంవత్సరం నాటికి పూర్తి భవనాలు కట్టడం పూర్తి చేయాలని శంకుస్థాపనకు పరిమితం కావద్దని ఇచ్చినా హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఆ ప్రభుత్వ భూమి చుట్టూ హద్దులు నిర్ణయించి రెసిడెన్షియల్ కి సరుపడ భూమిని తీసుకోని మిగితా భూమిని ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలకు కేటాయించాలని ఆయన అన్నారు.అట్టి భూమిపై సీపీఐ మండల కమిటీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు ఎండి యాకుబ్ పాషా పెండ్యాల సమ్మయ్య మండల సహాయ కార్యదర్శి రాడపక సత్తయ్య మాజీ మండల కార్యదర్శి ఎండి జాఫర్ కలకోట ప్రభాకర్ బాధవత్ రాందాన్ జువారి.నాగరాజు కాంగ్రెస్ మండల నాయకులు రాడపక దానియల్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.