అంబేడ్కర్ మరియు జగ్జీవన్ రామ్ మహోత్సవంఅంబేడ్కర్ మరియు జగ్జీవన్ రామ్ మహోత్సవం
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ21 March, 2026E69NEWS

అంబేడ్కర్ మరియు జగ్జీవన్ రామ్ జయంతుల మహోత్సవం

అంబేడ్కర్ మరియు జగ్జీవన్ రామ్ మహోత్సవం

ఖమ్మం జిల్లాలో వివిధ ప్రాంతాలలో జరిగే మహాత్మ జ్యోతిరావు పులే- బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతులు మరియు బాబు జగజ్జివన్ రామ్ జయంతి కార్యక్రమాలు సంబంధించి భీమ్ వారియర్స్ ఆధ్వర్యంలో జరిగే మహనీయుల జయంతుల మహోత్సవం పోస్టర్లని వైరా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కట్ల సంతోష్ గారు మరియు భీమ్ వారియర్స్ నాయకులు ఆవిష్కరించడం జరిగినది….

మహనీయులు అయిన భారతదేశంలో అన్ని సమస్త వర్గాలకోసం,మన హక్కుల కోసం, సంక్షేమం కోసం అవకాశాల కోసం స్వేచ్ఛ కోసం తమ జీవితాలను త్యాగం చేసి అసుర బాసిన మహానీయులు అయినటువంటి మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ప్రపంచం గర్వించదగ్గ భారత రాజ్యాంగ రూపకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి మరియు కార్మికుల బాంధవుడు మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు జయంతిని పురస్కరించుకోని వారి త్యాగాలని స్మరించుకొని ముందు తరాలకి తెలియజేయడమే లక్ష్యంగా ఖమ్మం జిల్లాలోని ఖమ్మం,వైరా,మధిర నియోజకవర్గాల్లో ఖమ్మం జిల్లాలోనీ వివిధ రకాల కార్యక్రమాలను చేపట్టడం జరుగుతున్నది ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని సంబంధించిన మహానీయుల జయంతుల మహోత్సవం పోస్టర్ని ఈ రోజు వైరా నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఆవిష్కరించడం జరిగింది….
ఈ కార్యక్రమంలో భీమ్ వారియర్స్ అధ్యక్షులు ఉదయ్ వారియర్, ఉపాధ్యక్షులు వెంకటేష్, ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్, నాయకులు రవి మహారాజ్, కోటా ప్రవీణ్, నారపోగు నాగరాజు,సతీష్ తదితరులు పాల్గొన్నారు

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *