ఐనవోలులో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంఐనవోలులో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ28 June, 2026E69NEWS

ఐనవోలులో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం

ఐనవోలులో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం

5 ఏళ్ల లోపు పిల్లలకు చుక్కలు తప్పనిసరి

•పోలియో రహిత సమాజం కోసం తల్లిదండ్రులు సహకరించాలని వైద్యాధికారి విజ్ఞప్తి

హన్మకొండ జిల్లా:ఐనవోలు మండలంలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో, వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కార్యక్రమం విజయవంతంగా జరిగింది. నిర్వహించిన కార్యక్రమంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసారు.ఈ సందర్భంగా ఐనవోలు మండల వైద్యాధికారి శ్రీదేవి మాట్లాడుతూ,5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి తల్లిదండ్రులు సహకరించాలని కోరారు.ప్రభుత్వ ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని పిల్లలను సమీప పోలియో కేంద్రాలకు తీసుకువచ్చి చుక్కలు వేయించాలని విజ్ఞప్తి చేశారు. ఐనవోలు మండల పరిధిలోని వివిధ పోలియో కేంద్రాల్లో ప్రజాప్రతినిధులు కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి, పల్లెదావకాన వైద్యులు, పర్యవేక్షకులు,ఏఎన్ఎమ్‌లు,ఆశా కార్యకర్తలు,అంగన్వాడీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *