చేయూత పెన్షన్ దరఖాస్తు కేంద్రం ప్రారంభం
ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో చేయూత పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దరఖాస్తు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు.ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే, సర్పంచ్ రేణుక–వెంకట్, పంచాయతీ కార్యదర్శి సురేష్తో ఫోన్ ద్వారా మాట్లాడి చేయూత పెన్షన్ దరఖాస్తుల ప్రగతి, దరఖాస్తుదారుల వివరాలు, ప్రజలకు అవసరమైన సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు.అనంతరం ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన దరఖాస్తు కేంద్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ కేంద్రంలో గ్రామ ప్రజల నుంచి చేయూత పెన్షన్ దరఖాస్తులను స్వీకరించడం, దరఖాస్తుదారుల వివరాలను నమోదు చేయడం, దరఖాస్తు ప్రక్రియపై అవసరమైన సూచనలు అందించడం జరుగుతుందని తెలిపారు.ప్రజలకు పెన్షన్ దరఖాస్తు విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సహకారం అందించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల, గ్రామ నాయకులు, వార్డు సభ్యులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.