డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సు డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సు
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ24 June, 2026E69NEWS

డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సు

డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సు

యువత మాదకద్రవ్యాల డ్రగ్స్ బారిన పడకుండా ఉండేందుకు, వాటి వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆత్మకూర్ ఇన్స్పెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. ఆత్మకూర్ పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ​ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ సంతోష్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ. మాదకద్రవ్యాల దుష్ప్రభావాల గురించి, అవి జీవితాలను ఎలా చిన్నాభిన్నం చేస్తాయనే విషయాలపై సుదీర్ఘంగా అవగాహన కల్పించారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలే తప్ప ఇలాంటి వ్యసనాలకు బానిసలు కాకూడదని హితవు పలికారు. అవగాహన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు “సే నో టు డ్రగ్స్” అనే అంశంపై ముగ్గుల పోటీలను నిర్వహించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. అనంతరం పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు.
​ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కవిత, అధ్యాపక బృందం మరియు దాదాపు 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *