ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ3 March, 2026E69NEWS

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం

ఖమ్మం రీజియన్ పరిధిలోని ఆర్టీసీలో ప్రయాణించే ప్రయాణికులు అందరికి మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని ఖమ్మం రీజినల్ మేనేజర్ ఏ. సరిరామ్ అన్నారు. మంగళవారం సత్తుపల్లి డిపోను సందర్శించి డిపో అభివృద్ధికై ఉద్యోగులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల భద్రత తో పాటు వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించడం తమ ముందున్న కర్తవ్యం అని ఆయన పేర్కొన్నారు. ముందుగా సత్తుపల్లి బస్టాండ్ పరిశీలించారు. డిపో అత్యధిక ఆదాయం సాధించేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలను ఉద్యోగులకు వివరించారు. పలువురు కండక్టర్ల తో ఆయన మాట్లాడుతూ వారు విధులు నిర్వహించే రూట్లలో వస్తున్న ఆదాయంపై ఆయన చర్చించారు. అదేవిధంగా గ్యారేజీలని బస్సులను పరిశీలించారు. నేషనల్ సేఫ్టీ వీక్ సందర్భంగా గ్యారేజీ లోని ఉద్యోగులతో సమావేశమై ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను ఆయన వివరించారు. డిపో అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సందర్భంగా ఉద్యోగులను కోరారు. అనంతరం హెయిర్ బస్ ఓనర్ ల తో సమావేశం ఏర్పాటు చేసి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించుటలో తమ వంతు కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రీజియన్ పరిధిలో అదనపు బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో: సత్తుపల్లి డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ మేనేజర్ పి ప్రవీణ్ కుమార్, మెకానికల్ ఇంజనీర్ ఎస్ సాహితి, ఖమ్మం రీజనల్ ఆఫీస్ సిఐ శ్రీనివాస్, ఎం ఎఫ్ చక్రవర్తి, డిపో ఏడీసీలు ఉద్యోగులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *