ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ మండల అధ్యక్షుడిగా రాజేందర్ ఎన్నిక
జాఫర్గడ్ మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా తాటికాయల రాజేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జాఫర్గడ్ మండల కేంద్రంలోని స్థానిక రామాలయం సమీపంలో ఏర్పాటు చేసిన ఫోటోగ్రాఫర్స్ యూనియన్ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు తిప్పరబోయిన కృష్ణ అధ్యక్షతన నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం తాటికాయల రాజేందర్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్న ప్రతి ఫోటోగ్రాఫర్ సోదరునికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ పదవి తనకు గౌరవం మాత్రమే కాదని, ప్రతి సభ్యుడి పట్ల గొప్ప బాధ్యత అని పేర్కొన్నారు.జాఫర్గడ్ మండలంలోని ప్రతి ఫోటోగ్రాఫర్‌ను అసోసియేషన్‌లో సభ్యుడిగా చేర్చేందుకు కృషి చేస్తానని, సభ్యులందరికీ అండగా నిలుస్తూ సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు నిజాయితీ, నిబద్ధతతో పనిచేస్తానని హామీ ఇచ్చారు. కుటుంబ భరోసా పథకం ద్వారా ప్రతి సభ్యుడి కుటుంబానికి భరోసా కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు.సభ్యుడికి ఏదైనా కష్టం వస్తే అది ఒక్క సభ్యుడి సమస్య కాదని, సంఘం మొత్తం సమస్యగా భావించి ఆపదలో ఉన్న ప్రతి సభ్యుడికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ముందుంటామని రాజేందర్ అన్నారు. మన హక్కులు, గౌరవం, సంక్షేమం కోసం అందరం ఐక్యంగా నిలబడి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్‌ను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు.నూతన కార్యవర్గ సభ్యులకు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు అభినందనలు తెలిపారు.
నూతన కార్యవర్గం
అధ్యక్షుడు:తాటికాయల రాజేందర్
ఉపాధ్యక్షులు: పాశికంటి విజయ్, నల్లతిగల ప్రసాద్
కార్యదర్శి: తిప్పరబోయిన కృష్ణ
ప్రధాన కార్యదర్శి: బండి దిలీప్ కుమార్
సహాయక కార్యదర్శి: కాటబోయిన సుమన్
కార్యవర్గ సభ్యులు: చెగొండ రమేష్, శామల శ్రీనివాస్, నిరటి సాంబరాజు, సాకి వెంకటస్వామి, సంధి శ్రీకాంత్, సాకి లింగస్వామి, సాకి రాహుల్, నర్సింగోజ్ సంకేత్.