ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమంఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమం
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ22 March, 2026E69NEWS

ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమం

ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమం

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సీతారామపురం గ్రామంలోని ప్రేమ్ సదన్ వృద్ధాశ్రమంలో ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొడకండ్ల మండలం రంగాపురానికి చెందిన వల్లూరి ఉపేందర్ వృద్ధాశ్రమంలో నివసిస్తున్న 20 మంది వృద్ధులకు ఉదయకాలంలో అల్పాహారంగా వారికి ఇష్టమైన టిఫిన్స్ పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా వల్లూరి ఉపేందర్ మాట్లాడుతూ, ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ అధ్యక్షులు పెదపూడి ప్రసన్న కుమార్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా చూసి తాను ప్రేరణ పొందానని తెలిపారు. ఆ ప్రేరణతో చిన్న స్థాయిలో సేవా కార్యక్రమాలు ప్రారంభించి, ఇప్పటి వరకు ముగ్గురు అబ్బాగ్యుల ఆకలిని తీర్చగలిగానని చెప్పారు.హైదరాబాద్‌లో కాళ్లు లేక నేలపై సాగుతూ జీవనం సాగిస్తున్న ఒక నిరుపేద వ్యక్తికి ఆహారం అందించిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ, ఇలాంటి సేవ చేయడం ద్వారా తనకు ఎంతో తృప్తి లభించిందన్నారు.ఆదివారం రోజు వృద్ధులకు సేవ చేసే అవకాశం కల్పించిన ఫౌండేషన్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ అధ్యక్షులు పెదపూడి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, కొడకండ్ల మండలానికి చెందిన వాట్సాప్ గ్రూప్ సభ్యులు వారానికి ఒక్కరు చొప్పున ముందుకు వచ్చి వృద్ధులకు సేవ చేయడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మానవత్వాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. మరింత మంది దాతలు ముందుకు వచ్చి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ప్రతి వారం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను వారు అభినందించారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *