•ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే నాగరాజు
బండౌతాపురంలో బొడ్రాయి, శివాలయ గజస్తంభం, దుర్గామాత విగ్రహ ప్రతిష్ట
•ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే నాగరాజు
తెలుగు గళం న్యూస్ వర్దన్నపేట/మే 3
వరంగల్ జిల్లా:వర్ధన్నపేట మండలం బండౌతాపురం గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ఠ, శివాలయం గజస్తంభం ప్రతిష్ఠాపన మరియు పెద్దమ్మ తల్లి దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు స్థానిక ప్రజలు, యువకులు, మహిళలు సంప్రదాయబద్ధంగా పూలదండలు, మంగళ వాయిద్యాల తో ఘన స్వాగతం పలికారు.ఆలయ ప్రాంగణంలో వేదమంత్రాల నడుమ పూజా కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో సాగాయి. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ…గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు సామాజిక ఐక్యతకు బలాన్నిస్తాయి. సాంప్రదాయాల పరిరక్షణతో పాటు సంస్కృతి వారసత్వాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత. ఆలయాల అభివృద్ధి గ్రామ అభివృద్ధికి ప్రతిబింబం. భక్తుల సౌకర్యార్థం అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తాం అని హామీ ఇచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉందని, ప్రజల అవసరాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు గ్రామ పెద్దలు మహిళలు, యువకులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.