బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలుబిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ29 January, 2026E69NEWS

బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు

బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు

బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది శూన్యం

మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్

మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా బిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు,గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఏమ్మెల్యే రెడ్యానాయక్, నవీన్ రావ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మహబూబాబాద్ జిల్లా, డోర్నకల్ నియోజకవర్గం, మరిపెడ మున్సిపాలిటీ కేంద్రం ఏస్సీ కాలనీ 10 & 11వ వార్డ్ లో నుంచి బీఎస్పీ పార్టీని విడి బిఎస్పీ జిల్లా కార్యదర్శి, డోర్నకల్ అసెంబ్లి ఇంచార్జ్ ఐనాల పరశురాములు బిఎస్పీ జిల్లా ఇంచార్జ్ తేజావత్ అభి నాయక్ (ఆలు), బిఎస్పీ మహిళ జిల్లా కో కన్వీనర్ బాషిపంగు నవత తోపాటు 20 కుటుంబాలను చెందిన కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు , ఈ సందర్బంగా వారికీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన
డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు మరిపెడ మున్సిపాలిటీ ఎన్నికల ఇంచార్జ్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి ఏనుగుల రాకేష్ రెడ్డి,ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పది సంవత్సరాల పాలనలో చేసిన అభివృద్ధిని చూసి మళ్లీ వచ్చేది కూడా బిఆర్ఎస్ ప్రభుత్వమేనని డోర్నకల్ నియోజకవర్గంలో రెడ్యానాయక్ చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమి లేదని వారు ఆకాంక్షించారు, ఈ మున్సిపల్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుస్తుందని ధిమా వ్యక్తంచేశారు,ఈకార్యక్రమంలో ఓడిసిఎంఎస్ మాజీ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి,మాజీ ఏంపిపి గూగులోత్ వెంకన్న,ఉప్పల నాగేశ్వర్ రావు,మాజీ కౌన్సిలర్ ఏడేల్లి పరశురాములు,పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *