
ఈ69న్యూస్ హన్మకొండ ఏప్రిల్ 28
మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యార్థులకు హానికరమైన టోబాకో ఉత్పత్తుల విక్రయాన్ని అరికట్టడంలో విశేష కృషి చేసిన ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్ కు ఉత్తమ ప్రశంస పురస్కారం లభించింది.పాఠశాలల సమీపంలో ఉన్న పాన్ షాపులు, కిరాణా దుకాణాల్లో విద్యార్థులకు సిగరెట్లు విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు, ఇన్స్పెక్టర్ కిషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ చర్యల్లో భాగంగా సుమారు 16 మందిని గుర్తించి, వారిపై సిగరెట్స్ అండ్ అదర్ టోబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ మరియు జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు.దీంతో మడికొండ పరిధిలోని పాఠశాలల చుట్టుపక్కల ప్రాంతాలను టోబాకో రహిత మండలాలుగా మార్చారు.ఈ సేవలను గుర్తించిన తెలంగాణ పోలీస్ విభాగం ఈగల్ టీమ్ చీఫ్ డీజీపీ సందీప్ శాండిల్య ఐపీఎస్, ఇన్స్పెక్టర్ కిషన్ కు నగదు బహుమతి మరియు ప్రశంసా పత్రం ప్రదానం చేశారు. ఈ పురస్కారాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ చేతుల మీదుగా అందుకున్నారు.ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ కిషన్ మాట్లాడుతూ, తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాల మేరకు, కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ నాయకత్వంలో, సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత సూచనలతో, ఏసీపీ కాజీపేట్ పింగళి ప్రశాంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.పిల్లలను హానికర పదార్థాల నుండి దూరంగా ఉంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని చెప్పారు.