మూగ క్రీడాకారునికి ఎస్సై ఆర్థిక సహాయంమూగ క్రీడాకారునికి ఎస్సై ఆర్థిక సహాయం
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ12 March, 2026E69NEWS

మూగ క్రీడాకారునికి ఎస్సై ఆర్థిక సహాయం

మూగ క్రీడాకారునికి ఎస్సై ఆర్థిక సహాయం

మానవత్వం చాటుకున్న ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ గౌడ్ సబ్ ఇన్‌స్పెక్టర్ గుర్రం కృష్ణ ప్రసాద్ గౌడ్ మానవత్వాన్ని చాటుకుంటూ ఒక మూగ క్రీడాకారునికి ఆర్థిక సహాయం అందించారు.పెద్దంపల్లి గ్రామానికి చెందిన మూగ క్రికెటర్ పసుల రాజు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న ఎస్సై వెంటనే స్పందించి రూ.5,000 నగదును అందజేశారు.పసుల రాజు వైకల్యాన్ని లెక్కచేయకుండా క్రికెట్ పట్ల అపారమైన ఆసక్తితో కృషి చేస్తూ జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకుంటున్నారు. అయితే పేదరికం కారణంగా క్రీడా సామాగ్రి కొనుగోలు చేయడం,ఇతర అవసరాలకు నిధుల కొరత ఎదుర్కొంటున్నట్లు తెలిసి ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ గౌడ్ వ్యక్తిగతంగా ముందుకొచ్చి సహాయం అందించారు.పోలీస్ విధుల్లో బిజీగా ఉన్నప్పటికీ సామాజిక బాధ్యతతో ఒక ప్రతిభావంతమైన క్రీడాకారునికి చేయూతనివ్వడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.ఎస్సై చేసిన ఈ సహాయం పసుల రాజుకు మరింత ప్రోత్సాహాన్ని కలిగిస్తుందని గ్రామస్థులు తెలిపారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *