రిటైర్డ్ కళాశాల అధ్యాపకుల సేవలు సమాజానికి మార్గదర్శకంరిటైర్డ్ కళాశాల అధ్యాపకుల సేవలు సమాజానికి మార్గదర్శకం
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ4 January, 2026E69NEWS

రిటైర్డ్ కళాశాల అధ్యాపకుల సేవలు సమాజానికి మార్గదర్శకం

రిటైర్డ్ కళాశాల అధ్యాపకుల సేవలు సమాజానికి మార్గదర్శకం

పెన్షనర్ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం-వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య హనుమకొండలో నిర్వహించిన రిటైర్డ్ కళాశాల అధ్యాపకుల పెన్షనర్స్ డే & డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..రిటైర్డ్ కళాశాల అధ్యాపకులు విద్యారంగానికి అందించిన సేవలు అమూల్యమైనవని,వారి అనుభవాలు సమాజానికి ఎంతో మార్గదర్శకమని పేర్కొన్నారు.అధ్యాపకుల కృషి వల్లే అనేక మంది విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగారని తెలిపారు.అనంతరం సంఘం రూపొందించిన డైరీని ఎంపీ ఆవిష్కరించి,సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

“పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి”

ఈ సందర్భంగా ఎంపీ డా.కడియం కావ్య మాట్లాడుతూ..పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.పదవీ విరమణ అనంతరం కూడా అధ్యాపకులు తమ జ్ఞానం,అనుభవాలను సమాజహితానికి వినియోగించుకోవడం అభినందనీయమని అన్నారు.సంఘ భవన అభివృద్ధికి రూ.10 లక్షల హామీ
రిటైర్డ్ కళాశాల అధ్యాపకుల సంఘ భవన అభివృద్ధికి రూ.10 లక్షల నిధులు మంజూరు చేస్తానని ఎంపీ ప్రకటించారు.అలాగే ప్రస్తుతం లీజుపై ఉన్న భవనాన్ని మరో 30 సంవత్సరాల పాటు లీజు పొడిగించేందుకు ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు.సీనియర్ సిటిజన్లు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని,ముఖ్యంగా మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.వచ్చే పెన్షనర్స్ డే కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో కలిసి హాజరుకావాలని కోరుతూ,ఇలాంటి కార్యక్రమాలు పరస్పర ఆత్మీయతను,ఐక్యతను పెంపొందిస్తాయని ఎంపీ తెలిపారు.కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో సంఘ ప్రెసిడెంట్ పులిసారంగాపాణి,వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు,సెక్రటరీ మల్లారెడ్డి,ఫైనాన్స్ సెక్రటరీ రాజయ్య, జాయింట్ సెక్రటరీలు కృష్ణమూర్తి,ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *