రైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలిరైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలి
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ24 March, 2026E69NEWS

రైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలి

రైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలి

రైతులు పండించిన దాళ్వా వరి పంటను,మొక్కజొన్న,పత్తి తదితర పంటలను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని,ధాన్యం కొనుగోలు కేంద్రాలు తక్షణమే ఏర్పాటు చేయాలని సీపీఎం సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణరెడ్డి డిమాండ్ చేశారు.
మంగళవారం సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండల కేంద్రంలోని ఎర్రా రామయ్య భవనంలో మోరంపూడి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సీపీఎం మండల కమిటి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శీలం మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల చేస్తున్న ప్రకటనలను అలుసుగా తీసుకొని దళారులు రైతులను దగా చేసి క్వింటాకు సుమారుగా 350 రూపాయల చొప్పున తగ్గించి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి యత్నిస్తున్నారని దీంతో రైతాంగం తీవ్రంగా నష్టపోయే దుస్థితి ఏర్పడిందని వారి దగా నుండి రైతన్నలను ప్రభుత్వం కాపాడాలని ఆవేదన వ్యక్తం చేశారు.అంతే కాకుండా సత్తుపల్లి మండల పరిధిలోని సిద్దారo,గౌరీగూడెం,సదాశివునిపాలెం,వేంసూరు మండల పరిధిలోని లింగపాలెం తదితర గ్రామాల్లో రైతులకు నకిలీ వరి విత్తనాలు అమ్మి మోసం చేసిన డీలర్లపై చర్యలు తీసుకోవాలని,విత్తన తయారీ సంస్థలపై పీడీ యాక్టు నమోదు చేసి నష్టపోయిన రైతాంగానికి పరిహారం ఇప్పించాలని కోరారు.లేకుంటే రైతాంగాన్ని రాజకీయాలకతీతంగా సమీకరించి పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో: మండల కార్యదర్శి అర్వపల్లి జగన్మోహన్ రావు,సీనియర్ నాయకులు అర్వపల్లి గోపాలరావు,కొత్తా సత్యనారాయణ,మల్లూరు చంద్రశేఖర్,అర్వపల్లి వెంకటేశ్వరరావు, గడిపర్తి మోహన్ రావు,చీపి రామకృష్ణ,పుచ్చకాయల వెంకటేశ్వరరావు,కావూరి సుదర్శనం,ఐద్వా నాయకురాలు శీలం కరుణ తదితరులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *