"మన సత్తుపల్లి - మన మట్ట" ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్
రెండో ఏడాది ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ ప్రారంభం చేసిన దయానంద్
సత్తుపల్లి,ఆర్ సి,ఏప్రియల్27(తెలుగుగళం)న్యూస్:వేసవి సెలవులను విద్యార్థులు వృధా చేయకుండా, వారిలో నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్టా రాగమయి దయానంద్ మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయకుమార్ ఆధ్వర్యంలో “మన సత్తుపల్లి – మన మట్ట” ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్‌ను ఘనంగా ప్రారంభించారు. సత్తుపల్లి పట్టణంలోని శిక్షణా కేంద్రంలో విజినరీ డైరెక్టర్ జొన్నలగడ్డ రాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మట్టా దయానంద్ విజయకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి శిబిరాన్ని ప్రారంభించారు.
గతేడాది ఘన విజయం – ఈ ఏడాది మరింత ఉత్సాహం:
ఈ సందర్భంగా మట్టా దయానంద్ విజయకుమార్ మాట్లాడుతూ, గత వేసవిలో నిర్వహించిన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులకు విద్యార్థుల నుండి అనూహ్య స్పందన లభించిందని, వందలాది మంది విద్యార్థులు ఇంగ్లీష్‌పై పట్టు సాధించి విజయవంతమయ్యారని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా ఈ ఉచిత శిక్షణను కొనసాగిస్తున్నామని, విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:
ఈ కార్యక్రమంలో విద్యార్థులకు మార్గనిర్దేశం చేసేందుకు పలువురు ముఖ్యులు పాల్గొన్నారు.
గాదే చెన్నారావు (సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు)
గాదే నరసింహారెడ్డి (నవ భారత్ డిగ్రీకళాశాల చైర్మన్)
కంచపోగు గోపాలరావు (విషనరీ డైరెక్టర్)
ఖమ్మపాటి రామకృష్ణ మరియు ఇతర నాయకులు, అధ్యాపక బృందం పాల్గొన్నారు