వ్యవసాయ కూలీ స్వర్ణలతను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర

చేనులో ప్రమాదవశాత్తు నాటు బాంబు పేలి తీవ్రంగా గాయపడిన వ్యవసాయ కూలీ గుండె స్వర్ణలతను భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదివారం పరామర్శించారు.రేగొండ మండల పరిధిలోని గూడెపల్లి గ్రామానికి చెందిన స్వర్ణలత వ్యవసాయ పనులు చేస్తుండగా నాటు బాంబు పేలుడు సంభవించి గాయపడటంతో,ఆమెను పరకాలలోని వినూత్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆసుపత్రికి చేరుకుని ఆమెను పరామర్శించారు.చికిత్స అందిస్తున్న డాక్టర్ నాగరాజు,ఆసుపత్రి యాజమాన్యం తిరుపతిరెడ్డితో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.బాధితురాలికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు.అనంతరం స్వర్ణలత కుటుంబ సభ్యులతో మాట్లాడి,అధైర్యపడవద్దని అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
