స్మశాన వాటిక ని ధ్వంసంస్మశాన వాటిక ని ధ్వంసం
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ13 March, 2026E69NEWS

స్మశాన వాటిక ని ధ్వంసం

స్మశాన వాటిక ని ధ్వంసం

నీలికుర్తి రెవెన్యూ నేతావత్ తండా పర్కల్ తండ గ్రామపంచాయతీ పరిధిలోని భజన తండాలో ప్రభుత్వ సర్వే నెంబర్ 66 లో 2019లో అప్పటి ప్రభుత్వం స్మశాన వాటికను నిర్మించడం జరిగింది. దానికి అనుకొని ఉన్న ప్రైవేట్ పట్టాగలిగినటువంటి 64 ఏ 64 బి సత్యనారాయణ రెడ్డికి ఎనిమిది ఎకరాల 15 గుంటల భూమి పట్టాగలిగి ఉన్నది ప్రభుత్వ భూమి కూడా తన దాంట్లోనే కలుపుకొని మన పట్టా లోనే ఉన్నది అని ప్రభుత్వ నిర్మించినటువంటి స్మశాన వాటికను ఎటువంటి రెవిన్యూ ప్రభుత్వ అధికారుల అనుమతులు లేకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన సత్యనారాయణ రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని సిపిఐ మరిపెడ మండల సమితి తరపున డిమాండ్ చేస్తున్నాము ప్రజాధనాన్ని ప్రజల కోసం ఉపయోగించిన స్మశాన వాటికని కూలగొట్టినటువంటి సత్యనారాయణ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని సిపిఐ మరిపెడ మండల సమితి తరపున డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో దశరవారీగా ప్రజా ఉద్యమాలని ప్రజా పోరాటాలని కొనసాగించవలసి వస్తుందని గత 20 రోజుల క్రితం అక్కడ భూమి వాదంలో తలెత్తిన అంశం మీద సాక్షాత్తు రెవిన్యూ ఆర్ ఐ రెవెన్యూ సర్వే సర్వే చేసి 20 రోజులై హద్దులు నిర్ణయించి స్మశాన వాటిక ప్రభుత్వ దానిలోకి వచ్చిందని తెలియజేయడం జరిగింది. కానీ సంబంధిత ఎమ్మార్వో గారు రిపోర్ట్ సర్వేను ప్రజలకు ఇవ్వకుండా మభ్యపెడుతున్నందుకు సిపిఐ పార్టీ తరఫున నిజాలను బయటకు చెప్పాలని సంబంధిత రెవిన్యూ అధికారులను డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో ఆర్డీవో స్థానిక సంస్థల రెవిన్యూ కలెక్టర్ జిల్లా కలెక్టర్ కి త్వరలోనే సమగ్ర నివేదికను అందజేస్తామని తెలియజేశారు,ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి మల్లెపాక యాకన్న జిల్లా కౌన్సిల్ సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్ లింగన్న తదితరులు పాల్గొన్నారు

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *