అమరజీవి దొడ్డి కొమరయ్య వర్ధంతి సభలను జయప్రదం చేయండి. అమరజీవి దొడ్డి కొమరయ్య వర్ధంతి సభలను జయప్రదం చేయండి.
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ3 July, 2026E69NEWS

అమరజీవి దొడ్డి కొమరయ్య వర్ధంతి సభలను జయప్రదం చేయండి.

అమరజీవి దొడ్డి కొమరయ్య వర్ధంతి సభలను జయప్రదం చేయండి.

వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు అమరజీవి కామ్రేడ్ దొడ్డికొమురయ్య వర్ధంతి సభలను జయప్రదం చేయాలని ఒక ప్రకటనలో కోరారు.ఈ సందర్భంగా కనక రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో నైజాం రజాకార్లు
జాగిర్దారులు భూస్వాములు
చేస్తున్న దోపిడి పీడన పై కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించిన ఫలితంగా తెలంగాణ ప్రాంతంలో పేదలకు భూములు దక్కడమే కాకుండా స్వేచ్ఛ స్వాతంత్రం రావడం జరిగిందన్నారు.ఈ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అమరుడైనరని అన్నారు.దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో సిపిఎం జనగామ జిల్లాలో రైతులు కూలీలు కార్మికులు కర్షకులు విద్యార్థులు యువజనలు వృత్తిదారులు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు చేయడం జరుగుతుందన్నారు.కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రజలు సాధించుకున్న హక్కులను భూములను గుంజుకొని ప్రాజెక్టుల పేరుతో అంబానీ ఆదాని పెట్టుబడిదారులకు
అప్పజెప్పడం జరుగుతుందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా నిలువ నీడలేని పేదలు రాష్ట్రవ్యాప్తంగా గుడిసెలు వేసుకొని నివసిస్తుంటే సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వం వాళ్ల
గూడును కూల్చివేసి దుర్మార్గమైన పద్ధతికి ఒడికడుతుందన్నారు.ఇప్పటికైనా గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలిచ్చి సౌకర్యాలు కల్పించాలని రైతాంగ సమస్యలు పరిష్కరించాలని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.జులై 4న జరిగే దొడ్డి కొమరయ్య వర్ధంతి సభలలో
ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కనక రెడ్డి కోరారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *