ఇంటింటి ప్రచారం నిర్వహించిన గండ్ర జ్యోతిఇంటింటి ప్రచారం నిర్వహించిన గండ్ర జ్యోతి
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ7 February, 2026E69NEWS

ఇంటింటి ప్రచారం నిర్వహించిన గండ్ర జ్యోతి

ఇంటింటి ప్రచారం నిర్వహించిన గండ్ర జ్యోతి

భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 27వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ విస్తృత ప్రచారం కొనసాగుతోంది.ఈ ప్రచారంలో భాగంగా భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గండ్ర జ్యోతి 27వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వాసాల ఈశ్వరమ్మకు మద్దతుగా ఇంటింటా వెళ్లి ఓటర్లను కలిసి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా గండ్ర జ్యోతి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ప్రజా సంక్షేమానికి అంకితభావంతో పనిచేసిన బిఆర్ఎస్ పార్టీనే మరోసారి గెలిపించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు.బిఆర్ఎస్ హయాంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలు గుర్తు చేసుకోవాలని, పట్టణాభివృద్ధిలో భూపాలపల్లికి విశేష ప్రాధాన్యం కల్పించిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఆమె తెలిపారు. మున్సిపల్ స్థాయిలోనూ బిఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో 27వ వార్డు ప్రచార ఇంచార్జీలు, గోరి కొత్తపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు హమీద్, టౌన్ అధ్యక్షుడు రఘుసాల తిరుపతి, సర్పంచ్ నిమ్మల శంకర్, గండ్ర యువసేన మండల అధ్యక్షుడు సుధనబోయిన సుమన్,జగ్గయపల్లి బిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు బోయిన తిరుపతి, వైనాల నాగరాజు, భూపాలపల్లి టౌన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *