జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు,వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్
BREAKING NEWS
ఏనుగల్లులో వివాహ వేడుకకు హాజరైన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్
తెలుగుగళం న్యూస్ పర్వతగిరి/మే3
వరంగల్ జిల్లా:పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామంలో జరిగిన వివాహ వేడుకల్లో జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు,వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఏనుగల్లు మాజీ వార్డు మెంబర్ ధోని దేవేందర్ – వసంత దంపతుల కుమారుడు చి. ధోని మహేందర్-భవాని నూతన దంపతుల వివాహ వేడుకలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ సర్పంచ్ తక్కళ్లపెల్లి భాస్కర్ రావు, ఏఎంసి మాజీ డైరెక్టర్ బోయినపల్లి యుగేందర్ రావు, మాజీ సర్పంచ్లు, వార్డు సభ్యులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు