గంట్ల గౌతమ్ రెడ్డి ఇంటింటి ప్రచారంగంట్ల గౌతమ్ రెడ్డి ఇంటింటి ప్రచారం
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ2 February, 2026E69NEWS

గంట్ల గౌతమ్ రెడ్డి ఇంటింటి ప్రచారం

గంట్ల గౌతమ్ రెడ్డి ఇంటింటి ప్రచారం

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి గంట్ల గౌతమ్ రెడ్డి సోమవారం ఇంటింటి ప్రచారం విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు, 12వ వార్డులోని ప్రజలను నేరుగా కలుస్తూ తనకు మద్దతు తెలపాలని అభ్యర్థించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రునాయక్ సారధ్యంలో వారి సూచనల తో 12వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తామని, తమను భారీ మెజార్టీతో గెలిపించాలని,వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు, వార్డులో ఉన్న ప్రజా సమస్యలను తమ సొంత సమస్యలుగా భావించి ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని హామీ ఇచ్చారు, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, ఇంటింటికి సన్న బియ్యం,కళ్యాణ లక్ష్మి, రైతులకు రుణమాఫీ, క్వింటాకు 500 రూపాయల బోనస్, వంటి పథకాలు అద్భుతంగా అమలవుతున్నాయని, ఈ అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు, ప్రచారంలో చిన్న పెద్ద లేకుండా అందర్నీ కలుస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదించండి అని ఓటర్లను కోరారు,ఈ కార్యక్రమంలో వెర్మారెడ్డి ప్రవీణ్ రెడ్డి,సంతోష్ రెడ్డి,గుండగని నరేష్,దశరథ్,మహేష్ భరత్,వెంకన్న,ఎడెల్లి పరుశురాములు తదితరులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *