గోపనపల్లిలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలుగోపనపల్లిలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ7 May, 2026E69NEWS

గోపనపల్లిలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

గోపనపల్లిలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

రైతులకు యూరియా వినియోగం తగ్గింపు, నేల ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించిన అధికారులు

•వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ డి.వీరన్న వరంగల్ జిల్లా:పర్వతగిరి మండలంలో గోపనపల్లిలో రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం రైతులను గ్రామంలో ఒకే వేదికలో అందరిని సమీకరించి విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డా. డి. వీరన్న, శాస్త్రవేత్త, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, వరంగల్ రైతులకు యూరియా వినియోగం తగ్గింపు, నేల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు.అవసరం మేరకుమాత్రమేరసాయనాలను వినియోగించడం ద్వారా పర్యావరణాన్ని రక్షించాల్సిన అవసరాన్ని వివరించారు.
అలాగే పంటల మార్పిడి విధానం, సమతుల్య ఎరువుల వినియోగం, నీటి ఆదా పద్ధతుల గురించి రైతులకు సవివరంగా తెలియజేశారు.మార్కెట్‌కు అనుగుణంగా పంటల రకాల ఎంపిక చేసి అధిక ఆదాయం పొందే విధానాలపై సూచనలు ఇచ్చారు. వ్యవసాయంలో శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని వివరించారు. సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులు ఆలోచించాలి అని, అలాగే చీడపీడలను సమగ్ర పద్ధతులద్వారానివారించాల్సిన అవసరాన్ని రైతులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల విద్యార్ధులు జి . పూజ,ఎన్.ఇందు,వ్యవసాయ విస్తరణ అధికారి బి.కార్తీక్, పంచాయతీ సెక్రటరీ ఎండీ.పాషా మరియు రైతులు పెద్ద పాల్గొని వ్యవసాయానికి సంబంధించిన వివిధ అంశాలపై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *