
ఈ69న్యూస్ జనగామ/స్టేట్ బ్యూరో రిపోర్టర్ ముహమ్మద్ సలీం
జనగాం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్-ఫూలే అధ్యయన వేదికలో మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బహుజన్ సమాజ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రాపాక శ్రీశైలం అధ్యక్షత వహించగా,ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి నిర్మలా రత్నం హాజరయ్యారు.ఆమె మహాత్ముడు జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి, ఆయన సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ..”బడుగు,బలహీన వర్గాలకు విద్య ద్వారా ఉత్తమ జీవన మార్గాన్ని చూపిన మహాత్ముడు ఫూలే.నేటి యువత ఆయన అడుగుజాడల్లో నడవాలి”అన్నారు.ఈ సందర్భంగా జనగాం అసెంబ్లీ ఇంచార్జి జేరిపోతుల మల్లయ్య,జనగాం ఉపాధ్యక్షురాలు గందమళ్ల నవనీత,పాలకుర్తి అసెంబ్లీ ఉపాధ్యక్షులు ఎల్పుకొండ కుమారస్వామి,అసెంబ్లీ కార్యదర్శి తాండ్ర లావణ్య,నియోజకవర్గ నాయకులు చిలుముల అర్జున్,తాండ్ర అఖిల్,గందమల్ల నవీన్ తదితరులు పాల్గొన్నారు.