ఘనంగా మే డే 140 వ వేడుకలు
మరిపెడ మండల కేంద్రంలో ని స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ దగ్గర సిపిఐ పార్టీ మరిపెడ మండల సమితి ఆధ్వర్యంలో 140 వ మేడే వేడుకలను నిర్వహించడం జరిగింది. కార్మిక శ్రామిక కర్షక హక్కుల కోసం ప్రపంచవ్యాప్తంగా జరిగే మేడే వేడుకల్లో భాగంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడులను వెంటనే రద్దు చేయాలని కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కార్మికులకు వేతన చట్టాన్ని అమలు చేయాలని మొదలైన కార్మిక సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మరిపెడ మండలం మాజీ సర్పంచ్ పాను గోతు రాంలాల్ గౌరవ అతిథిగా రావడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మల్లెపాక యాకన్న జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలవాల ఉపేందర్ కుడితి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు