జె.వి.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సుజె.వి.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ7 July, 2026E69NEWS

జె.వి.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు

జె.వి.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు

జె.వి.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), సత్తుపల్లిలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశం పొందిన ప్రథమ సంవత్సరం విద్యార్థుల కోసం అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. గోపి అధ్యక్షత వహించారు.
విద్యార్థులకు కళాశాల విద్యా విధానం, అకాడమిక్ నిబంధనలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, విద్యార్థి సంక్షేమ పథకాలు, గ్రంథాలయ వినియోగం, పరీక్షల విధానం మరియు ఉన్నత విద్యలో లభించే అవకాశాలపై సమగ్ర అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ నండ్రు గోపి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని, కళాశాల కల్పిస్తున్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.
షేక్ పీర్ సాహెబ్ మాట్లాడుతూ, విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం, సమర్థవంతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు నైతిక విలువలను పెంపొందించుకోవడం ద్వారా సమాజంలో ఆదర్శ పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు.
వై. మహేష్ మాట్లాడుతూ, ఉన్నత విద్య ప్రాముఖ్యతను వివరించి, ప్రతి విద్యార్థి తనలోని ప్రతిభను గుర్తించి, నిరంతర శ్రమతో లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని కోరారు.పరీక్షల విభాగం నుంచి
ఎస్. బాబు మాట్లాడుతూ కళాశాల అకాడమిక్ క్యాలెండర్, హాజరు నిబంధనలు, పరీక్షల విధానం, గ్రంథాలయ వినియోగం, కెరీర్ అవకాశాలు మరియు ఉపాధి మార్గాలపై విద్యార్థులకు సమగ్రంగా వివరించారు.
కళాశాల తెలుగు విభాగధిపతి ఇంచార్జ్ ఫిజికల్ డైరెక్టర్ డా. సి.హెచ్. పూర్ణచంద్రరావు మాట్లాడుతూ, విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న క్రీడల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర, జాతీయ స్థాయిలలో రాణించేందుకు కళాశాల తరఫున అవసరమైన అన్ని సౌకర్యాలు, ప్రోత్సాహం మరియు సహకారం అందిస్తామని తెలిపారు. విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించడం ద్వారా శారీరక, మానసిక వికాసం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాఎం. బాలకృష్ణ, డా బి. వెంకటేశ్వర్లు, డా ఓ. చెన్నారావు, డా కె. పద్మారాణి, డాఎం. మాధవి, జి. సుభాషిని తదితరులతో పాటు కళాశాల బోధనేతర సిబ్బంది ప్రథమ సంవత్సరం విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com
One thought on “జె.వి.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *