నల్లబెల్లిలో పల్స్ పోలియో కార్యక్రమంనల్లబెల్లిలో పల్స్ పోలియో కార్యక్రమం
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ28 June, 2026E69NEWS

నల్లబెల్లిలో పల్స్ పోలియో కార్యక్రమం

నల్లబెల్లిలో పల్స్ పోలియో కార్యక్రమం

చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసిన సర్పంచ్ జక్కి అనిత శ్రీకాంత్

•పోలియో రెండు చుక్కలు-పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాది వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో నేడు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్లబెల్లి గ్రామ సర్పంచ్ జక్కి అనిత శ్రీకాంత్ హాజరై 5 సంవత్సరాల లోపు బాల బాలికలకు పోలియో చుక్కలు వేసారు.ఈ సందర్భంగా సర్పంచ్ జక్కి అనిత శ్రీకాంత్ మాట్లాడుతూ, పిల్లల నిండు జీవితానికి పోలియో చుక్కలు ఎంతో ముఖ్యమని అన్నారు. పోలియో రహిత సమాజాన్ని నిర్మించడం కోసం పోలియోను నిర్మూలించాలని పిలుపునిచ్చారు. పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు, పోలియో టీకాలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ మేకల దేవేందర్,వార్డు సభ్యులు మహమ్మద్ జమీలాబి, ముత్యం రేణుక,వైద్యులు సౌమ్య, ఏఎన్ఎం దేవయాని, ఆశా కార్యకర్తలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *